The sacred composition of the Ashtalakshmi stotram extols the eight forms of Goddess Lakshmi and explains their significance.
Beginning with the lyrics Sumanasa Vandita, the Ashtalakshmi stotram lyrics divinely invocate the eight forms of Goddess Lakshmi for their blessings.
These goddesses symbolize fortune in eight different ways, bestowing devotees with wealth, prosperity, victory, education, courage, sustenance, offspring, and spiritual liberation.
As the Goddess of wealth and the consort of Lord Vishnu, Mother Lakshmi is revered for her grace.
Reciting this stotram 3 times is an effective way to invoke the blessings of Goddess Lakshmi.

Ashtalakshmi Stotram Lyrics in Telugu – శ్రీ అష్టలక్ష్మీ స్తోత్రం (సుమనస వందిత)
ఆదిలక్ష్మీ:
సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే
మునిగణవందిత మోక్షప్రదాయిని మంజులభాషిణి వేదనుతే
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే
జయ జయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ (1)
ధాన్యలక్ష్మీ:
అయి కలికల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే
క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే
జయ జయ హే మధుసూదనకామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మామ్ (2)
ధైర్యలక్ష్మీ:
జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే
జయ జయ హే మధుసూదనకామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మామ్ (3)
గజలక్ష్మీ:
జయ జయ దుర్గతినాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే
రథగజ తురగపదాది సమావృత పరిజన మండిత లోకనుతే
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాపనివారణ పాదయుతే
జయ జయ హే మధుసూదనకామిని గజలక్ష్మి రూపేణ పాలయ మామ్ (4)
సంతానలక్ష్మీ:
అయి ఖగవాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్తభూషిత గాననుతే
సకల సురాసుర దేవమునీశ్వర మానవ వందిత పాదయుతే
జయ జయ హే మధుసూదనకామిని సంతానలక్ష్మి సదా పాలయ మామ్ (5)
విజయలక్ష్మీ:
జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞానవికాసిని గానమయే
అనుదినమర్చిత కుంకుమధూసరభూషిత వాసిత వాద్యనుతే
కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే
జయ జయ హే మధుసూదనకామిని విజయలక్ష్మి సదా పాలయ మామ్ (6)
విద్యాలక్ష్మీ:
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే
మణిమయభూషిత కర్ణవిభూషణ శాంతిసమావృత హాస్యముఖే
నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయ హే మధుసూదనకామిని విద్యాలక్ష్మి సదా పాలయ మామ్ (7)
ధనలక్ష్మీ:
ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభినాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాద సువాద్యనుతే
వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గ ప్రదర్శయుతే
జయ జయ హే మధుసూదనకామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మామ్ (8)
|| ఇతి శ్రీ అష్టలక్ష్మీ స్తోత్రమ్ ||